- సోలార్ ప్లాంట్‌కు భూమిపూజ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: మహిళా సాధికారత, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ నియోజకవర్గం సత్యావార్ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రూ. 3 కోట్లతో చేపట్టనున్న ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు ఏటా రూ. 26 లక్షల ఆదాయం సమకూరుతుందని, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ మాదిరిగానే భవిష్యత్‌లో పాడి పరిశ్రమ బాధ్యతలను కూడా వీరికి అప్పగిస్తామని వెల్లడించారు. అనంతరం భూత్పూర్ నుంచి కొత్తపల్లి వరకు రూ. 1.50 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రి, భూత్పూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే ముంపు గ్రామాల తరలింపు ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశారు.
