న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీ రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను శ్రీహరి అడిగి తెలుసుకున్నారు. అలాగే, రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
