కేటీఆర్ పని ఖతం..భారీ మెజార్టీతో గెలుస్తున్నం: మంత్రి వెంకటస్వామి

కేటీఆర్ పని ఖతం..భారీ మెజార్టీతో గెలుస్తున్నం: మంత్రి వెంకటస్వామి
  • జూ బ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ మెజార్టీతో గెలుస్తున్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే విజయం
  • విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నం  
  • ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడి
  • మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్/చెన్నూరు/ జైపూర్/​ కోటపల్లి, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్​అభ్యర్థి నవీన్ యాదవ్​25 వేల నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవనున్నారని మంత్రి వివేక్​ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికతో కేటీఆర్​పని ఖతమని వ్యాఖ్యానించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కాంగ్రెస్ పార్టీనే​గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో వివేక్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలతో  రెండు నెలలుగా తనతో పాటు మంత్రులు పొన్నం, తుమ్మల జూబ్లీహిల్స్​బాధ్యతలు తీసుకుని  పని చేశామని తెలిపారు. పార్టీ క్యాడర్​సహకారంతో 22 శాతం మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పార్టీని 14 శాతం ఆధిక్యంలోకి తీసుకొచ్చామని చెప్పారు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని  పదేండ్ల పాలనలో బీఆర్ఎస్​ఏమాత్రం పట్టించుకోలేదని, తాము అన్ని డివిజన్లలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని వెల్లడించారు.  

రైతులకు అండగా ఉంటం.. 

ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేలా సీసీఐ, కేంద్రంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేస్తానని మంత్రి వివేక్​భరోసా ఇచ్చారు.  ‘‘గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొన్న సీసీఐ.. ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించింది. పాత విధానం కొనసాగించాలని ఇప్పటికే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కేంద్రానికి లెటర్​రాశారు. 

నిరుడు కూడా  చెన్నూరు ప్రాంతంలో పత్తి కొనుగోలు గడువును పెంచాలని సీసీఐ చైర్మన్​, కేంద్ర మంత్రిపై ఎంపీ వంశీకృష్ణ ఒత్తిడి తెచ్చి  రైతులకు అండగా నిలిచారు” అని గుర్తుచేశారు. రైతులు తేమ లేకుండా పత్తిని తీసుకొచ్చి, -ఏ గ్రేడ్ పత్తికి క్వింటాలుకు రూ.8,100 మద్దతు ధర పొందాలని సూచించారు. బీఆర్ఎస్​కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు వృథా చేసిందని మండిపడ్డారు.

 కాళేశ్వరం నీళ్లు రాకున్నా రైతులు రికార్డు స్థాయిలో  ధాన్యం పండించారని పేర్కొన్నారు. ‘‘యూరియా పంపిణీ, పత్తి కొనుగోలు బాధ్యతలు కేంద్రం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యతలపై అవగాహనలేని కొందరు సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం తక్కువ యూరియా ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో కొరత వచ్చింది” అని అన్నారు. మంత్రి వెంట కలెక్టర్​కుమార్​దీపక్, అడిషనల్​కలెక్టర్​చంద్రయ్య, డీఈవో యాదయ్య, ఫిషరీస్​ ఏడీ అవినాశ్ ఉన్నారు. 

బడులను బాగు చేస్తున్నం.. 

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివేక్​తెలిపారు. ‘‘గతంలో సర్కారు బడుల్లో టీచర్ల కొరతతో పాటు మౌలిక వసతుల లేమితో సరైన విద్య అందేది కాదు. మేం అధికారంలోకి రాగానే  51 వేల టీచర్​ పోస్టులను భర్తీ చేశాం. పాఠశాలల్లో  ఫర్నీచర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాం. చెన్నూరు డిగ్రీ కాలేజీలో రూ.2.5 కోట్ల సీఎస్ఆర్​ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అదనపు గదులు నిర్మించాం.

 రామకృష్ణాపూర్ గురుకుల పాఠశాలను రూ.30 లక్షల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ నిధులతో అభివృద్ధి చేశాం. ఇంకా స్కూళ్లు, కాలేజీల్లో  అవసరమైన సదుపాయాల కోసం 15 రోజుల్లో ప్రపోజల్స్​ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించాను. 75 శాతం మార్కులు వచ్చిన స్టూడెంట్లకు మా అంబేద్కర్​కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తాం. ఇందుకోసం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో విశాక ట్రస్టు ద్వారా స్కూళ్లలో క్లాస్​రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం చేపట్టాం. బెంచీలను అందించాం. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు అండగా నిలవాలి. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. టీచర్లు విద్యార్థులకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​స్కిల్స్​ నేర్పించడంపై శ్రద్ధ పెట్టాలి” అని సూచించారు.