మీతో కలిసి నడుస్తా.. మీకు అండగా ఉంటా: మంత్రి వివేక్

మీతో కలిసి నడుస్తా.. మీకు అండగా ఉంటా: మంత్రి వివేక్

హైదరాబాద్: నేను మీతో ఉంటా.. మీతో కలిసి నడుస్తానని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం (సెప్టెంబర్ 21) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సూర్యానగర్ డివిజన్‎లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ బై పోల్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర స్థానిక కాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజులకు ఒకసారి ఇదే షేక్ పేట్ రోడ్డులో వెళ్తుంటానని.. ఇక్కడి సమస్యలు అన్ని తనకు తెలుసన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన పనుల గురించి జీహెచ్ఎంసీ జోనల్ అధికారిని పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. షేక్ పేట్‎లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయని.. ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలు ఉంటారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.