
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఊరూరా తీరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చుకుని ఆడపడుచులూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. రహమత్ నగర్ లో మహిళలు భారీ బతుకమ్మ ఏర్పాటు చేసి ఆడిపాడారు. వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా బతుకమ్మ ఆడారు మహిళలు.
ఈ బతుకమ్మ వేడుకలకు మంత్రి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజా వివేక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రమహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ లో బతుకమ్మ సంబరాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.