టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముజాయిద్ అలం ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం ( మార్చి 8 ) జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ సహా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. రంజాన్ మాసంలో ముస్లింలు ఒక్కపొద్దులు ఉంటూ పవిత్రంగా దేవుడిని ఆరాధిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్ధనలు చేసి , ఇఫ్తార్ ను స్వీకరించారు మంత్రి వివేక్.ముజాయిద్ అలం ఖాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
రంజాన్ మాసం అనేది పేద , ధనిక భావం లేకుండా అందరిని సమానంగా చూస్తుందని , ఇఫ్తార్ విందు ఇందుకు నిదర్శనం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
