మాలల సింహగర్జనతో కొందరి నోర్లు మూతపడ్డయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి

మాలల సింహగర్జనతో  కొందరి  నోర్లు మూతపడ్డయ్: మంత్రి వివేక్ వెంకటస్వామి

మాలల సింహగర్జన తో కొంత మంది నోర్లు మూతపడ్డాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.  స్పాన్సర్ ప్రోగ్రాం అని ప్రచారం చేసిన వాళ్లకు చెంప పెట్టుగా మాలలు సంఘటితంగా తమ శక్తిని చూపెట్టారని అన్నారు. మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే   వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయని తెలిపారు. హైదరాబాద్ లోని లక్డికపుల్ లో మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగ మాట్లాడిన మంత్రి వివేక్..  ఇంతకాలం మాలలు సంఘటితం లేకపోవడం వల్లే అన్ని రంగాలలో నష్టపోయారు. విద్య , ఉపాధి , ప్రమోషన్ లలో అన్యాయానికి గురయ్యారు.ఎస్సీ రిజర్వేషన్ నిర్ణయం పై న్యాయ పోరాటం చేస్తున్నాం. తన వెంట మాలలు ఉంటే , జాతి బాగుకోసం బలంగా పనిచేస్తా. ఆ దిశగా మాలలు ఐక్యంగా ఉండాలి. అదే జోష్ ను ముందుకు తీసుకెళ్లాలి. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే  నేను అండగా ఉంటా. వారికి న్యాయం జరిగేలా చూస్తాను. అని వివేక్  అన్నారు.