
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు నేతలు నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి దొడ్డి కొమురయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. కుర్మ కులాలతో తనకు దగ్గరి సంబంధం ఉందన్నారు వివేక్. తన నియోజకవర్గంలో కూడా కుర్మ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఆయన వర్ధంతిలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన కులాలను అభివృద్ధి చేసే దిశగా రాహుల్ గాంధీ కులగనని తీసుకొచ్చారని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు వివేక్.