జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రచారంలో భాగంగా షేక్ పేటలోని ఆదిత్య టవర్స్ లో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్.. జూబ్లీహిల్స్ గెలిస్తే రూ.500 కోట్ల పనులు చూపిస్తా అని కేటీఆర్ అంటున్నారు.. పదేండ్లు అధికారంలో ఉండే ఏం చేయలేదు.. ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు వివేక్. అసలు ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు.
రాష్ట్రంలో ఇంకా మూడేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని అభివృద్ధి తమతోనే సాధ్యమని చెప్పారు మంత్రి వివేక్ . షేక్ పేటలోనే రూ.115 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రూ.60 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి..మిగతా పనులు జరుగుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తామన్నారు వివేక్. ఎలక్షన్ తర్వాత కూడా తాను ఇక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తని.. మీ అందరి మధ్య ఉంటూ పనులు చేస్తారని చెప్పారు. అపార్ట్ మెంట్ వసూలు ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచి.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
