వైఎంసీఏలోనే క్రికెట్ ఆడిన..కాలేజీ డేస్ గుర్తుచేసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

వైఎంసీఏలోనే క్రికెట్ ఆడిన..కాలేజీ డేస్ గుర్తుచేసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాలేజీ డేస్​ గుర్తుచేసుకున్న కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులనే ప్రోత్సహిస్తామని భరోసా
  • మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటామని  హామీ

హైదరాబాద్: వైఎంసీఏతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. తన కాలేజీ రోజుల్లో ఇక్కడే క్రికెట్ ఆడేవాడినని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు. ఆధునిక సదుపాయాలతో రెండు ఏసీ ఆడిటోరియంలు, గెస్ట్ రూమ్ లను నిర్మించిన వైఎంసీఏ ప్రతినిధులను అభినందించారు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

సికింద్రాబాద్‌లోని వైఎంసీఏ ప్రాంగణంలో ఇంటర్నేషన్​ ఇంటిగ్రేటెడ్​సెంటర్​ని  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ‘వైఎంసీఏ ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నరు. అందరూ ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం ముందడుగు వేయాలి. సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది’ అని మంత్రి  భరోసా ఇచ్చారు.

►ALSO READ | మేం ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లే.. మాకు అందరికి బాస్ అతనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్