మేం ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లే.. మాకు అందరికి బాస్ అతనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

మేం ఎవరిపైనా పెత్తనం చెలాయించట్లే.. మాకు అందరికి బాస్ అతనే: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్: యాకుత్ పురలో ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్‎లో పడిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురువారం (సెప్టెంబర్ 11) ఉదయం యాకుత్ పురలో ఐదేళ్ల బాలిక మ్యాన్ హోల్‎లో పడింది.. వెంటనే వాల్ల నాన్నమ్మ బయటికి తీసిందని తెలిపారు. హైడ్రా వల్లే తప్పు జరిగినట్లు గుర్తించామన్నారు రంగనాథ్. ఈ ఘటనకు బాధ్యులైన హైడ్రా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

బాలిక మ్యాన్ హోల్‎లో పడిన చుట్టుపక్కల నాలుగైదు మ్యాన్ హోల్స్ ఉన్నాయని.. అందులో ఒకటి వాటర్ బోర్డు వాళ్ళు క్లీన్ చేశారని చెప్పారు. అయితే.. బాలిక పడిన మ్యాన్‎హోల్ మాత్రం హైడ్రా సిబ్బందే క్లీన్ చేశారని.. హైడ్రా వల్లే తప్పు జరిగిందని అంగీకరించారు రంగనాథ్. మంచి చేస్తేనే మా ఖాతాలో వేసుకోవడం కాదు.. తప్పు జరిగినప్పుడు కూడా ఒప్పుకుంటున్నామని పేర్కొన్నారు. 

జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హైడ్రా మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని తెలిపారు రంగనాథ్. జీహెచ్ఎంసీ పెద్ద ఆర్గనైజేషన్ అని.. మేము ఎవరిపై పెత్తనం చెలాయించట్లేదని చెప్పారు. మా అందరికీ బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయ పరంగా చేసే కామెంట్స్‎పై మేం స్పందించమని చెప్పారు. 

►ALSO READ | డీజిల్‌లో ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్ కలుపుతాం: నితిన్ గడ్కరీ

ఫ్యూచర్‎లో మళ్ళీ ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‎కి డీఆర్ఎఫ్ టీమ్ ఇంచార్జ్‏గా ఉన్నారని.. ఆయనపై చర్యలు ఉంటాయని తెలిపారు. నగరంలో ఉన్న మ్యాన్ హోల్స్‎పై ఆడిట్ చేస్తున్నామని.. మూతలు సరిగా లేనివి గుర్తించి సంబంధిత ఏజెన్సీకి సెక్రెటరీ ద్వారా రిఫర్ చేస్తామని చెప్పారు. 

హైడ్రాకు శాంక్షన్ అయిన బడ్జెట్‎లో ఒక క్వార్టర్ ది మాత్రమే రిలీజ్ అయిందని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్‎లో త్వరలో కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సున్నం చెరువులో పనులు ఆపమని కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ లేదని వెల్లడించారు. బతుకమ్మ కుంట పనులు పూర్తవబోతున్నాయని.. త్వరలోనే సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి బతుకమ్మ పండగ అక్కడ జరిగేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.