డీజిల్‌లో ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్ కలుపుతాం: నితిన్ గడ్కరీ

డీజిల్‌లో ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్ కలుపుతాం: నితిన్ గడ్కరీ

దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్ కలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇ20 పెట్రోల్ వాడకం గురించి వాహనదారుల్లో ఉన్న అపోహలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్‌ను డీజిల్‌లో కలపనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 

డీజిల్‌లో ఇథనాల్‌ను కలిపే ప్రయోగం విజయవంతం కాలేదని.. అందువల్ల దానికి బదులుగా ఐసోబుటనాల్ మెరుగైనది గుర్తించినట్లు చెప్పారు గడ్కరీ. డీజిల్‌లో ఇథనాల్‌ మిక్స్ చేసినప్పుడు ఇంజిన్ సమస్యలతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్పారు. బయోఫ్యూయల్ మిక్సింగ్ విదేశీ కరెన్సీని ఆదాచేయటంతో పాటు భారీ ఫ్యూయెల్ బిల్లుల నుంచి ఉపశమనం కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ పై సోషల్ మీడియాలో తనపై కావాలనే తప్పుడు ప్రచారం కొనసాగించాలని గడ్కరీ ఇటీవల అన్నారు. అవి పూర్తిగా పెట్రోల్ లాబీ స్పాన్సర్ చేసిన పెయిడ్ ప్రచారం అన్నారు గడ్కరీ. E20 ఇంధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు. ఇథనాల్ వల్ల వాహనాల ఇంజన్లు పాడవుతాయనం పూర్తిగా నిరాధారమైనదిగా కొట్టిపడేశారు. కానీ కొందరు నిపుణులు మాత్రం ఇథనాల్ వల్ల పాత వాహనాల్లో ఇంజిన్లో తుప్పు, రబ్బర్ భాగాలు పడవటం జరుగుతుందని అంటున్నారు. మైలేజ్ కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. 

ALSO READ : 10 నెలల తర్వాత మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 

ప్రస్తుతం డీజిల్ విషయంలో ఐసోబుటనాల్ కలపాలనుకోవటానికి కారణం అందులో ఇథనాల్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉండటమే. డీజిల్‌లో కలిపినప్పుడు ఇంజిన్ పనితీరు మెరుగుపడి కాలుష్యం కూడా తగ్గినట్లు గుర్తించారు. ఇథనాల్ మాదిరిగానే ఐసోబుటనాల్ కూడా చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఐసోబుటనాల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడమే. దీని శుద్ధికి కర్మాగారాలకు నూ టెక్నాలజీ అవసరం ఉందని తెలుస్తోంది.