10 నెలల తర్వాత మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార ధరలు..

10 నెలల తర్వాత మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. పెరిగిన ఆహార ధరలు..

గడచిన కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు దఫాలుగా ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే 10 నెలల తర్వాత తొలిసారిగా మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలను నమోదు చేసింది. 

ఆగస్టు 2025లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా నమోదైంది. సీపీఐ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ టార్గెట్ 4 శాతానికి లోపే ఆగస్టులో కూడా వరుసగా 7వ నెల కూడా కొనసాగుతోంది. గడచిన ఏడాది కాలంలో కేవలం జూలై 2025లో మాత్రమే రిటైల్ ద్రవ్యోల్బణం అత్యల్పంగా 1.61 శాతంగా నమోదైంది.

ALSO READ : సోషల్ మీడియాలో Nano Banana గోలగోల..

ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం 3 నెలల గరిష్టాన్ని తాకింది. ఫుడ్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 0.05 శాతంగా నమోదైంది. నవంబరులో ఆహార పదార్థాల రేట్లు పెరిగినట్లు ఇది సూచిస్తుంది. అలాగే కూరగాయల ద్రవ్యోల్బణం కూడా పెరుగుదలను చూసింది. అయితే పప్పుధాన్యాలు, పండ్ల రేట్లు మాత్రం స్వల్పంగా ఆగస్టులో తగ్గుదలను చూశాయి.