సోషల్ మీడియాలో Nano Banana గోలగోల.. మీరు కూడా ఇలా సింపుల్‌గా ఏఐతో చేస్కోండి..

సోషల్ మీడియాలో Nano Banana గోలగోల.. మీరు కూడా ఇలా సింపుల్‌గా ఏఐతో చేస్కోండి..

Nano Banana: వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్ పోస్టులు.. ఇన్ స్ట్రా అప్ డేట్స్ లో కొత్తగా ఒకటి ట్రెండ్ అవుతుంది. సరికొత్త ఫొటోలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి అందరినీ.. అవే నానో బనానా.. తమ తమ ఫొటోలను త్రీ డీలో అప్ లోడ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నానో బనానా ఫొటోలు అచ్చం విగ్రహంలా ఉండటం.. క్లాలిటీగా ఉండటంతో చాలా మంది వాటిని క్రియేట్ చేసుకుంటున్నారు. సినీ, క్రికెట్ ఫ్యాన్స్ అయితే తమకు ఇష్టమైన స్టార్ల ఫొటోలను నానో బనానా ఇమేజ్ క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి.. ఏ టూల్ వాడాలి.. మొబైల్ లో చేసుకోచ్చా.. కంప్యూటర్ ఉండాల్సిందేనా అనే వివరాలు తెలుసుకుందాం..

గడచిన రెండు మూడు రోజులుగా నానో బనానా అనేది సంచలనంగా సోషల్ మీడియాను ఆకర్షిస్తున్న ఒక కొత్త ట్రెండ్. ఇది టెక్ దిగ్గజం గూగుల్ కి చెందిన Gemini 2.5 Flash Image అనే AI టూల్ ఆధారంగా పనిచేస్తుంది. దీనికోసం ముందుగా గూగుల్ జెమినీలో లాగిన్ అవ్వాలి. ఈ టూల్ సాధారణ ఫోటోలను రియలిస్టిక్ 3D చిన్న మోడెల్స్ లాగా మార్చగలదు. ఈ ట్రెంట్ సోషల్ మీడియాలో సామాన్య యూజర్ల నుంచి సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయన్సర్లు, రాజకీయ నాయకుల వరకు అందరినీ ఆకట్టుకుంటోంది. యూజర్లు తమకు నచ్చిన విధంగా ఫోటోలను నానో బనానా స్టైల్ లో చాలా సులువుగా సృష్టించటంతో.. ఈ ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. గూగుల్ జెమినీ టూల్ ఉపయోగించి కొన్ని ప్రాంప్ట్‌లు ఇస్తూ 3D మోడెల్స్ సృష్టించవచ్చు. అయితే.. నానో బనానా ఫొటోలు క్రియేట్ చేయటానికి గూగుల్ జెమిని 2.5 ఆధారిత AI టూల్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ALSO READ : గేమింగ్ కంపెనీలో లేఆఫ్స్.. 

నానో బనానా ట్రెంట్ క్రియేట్ చేసే స్టెప్స్:
1. Google Gemini 2.5 AI టూల్ వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ఓపెన్ చేయండి
2. టూల్ LTX Studio లేదా Google AI స్టూడియోలో అందుబాటులో ఉంటుంది. అక్కడ కుడివైపు ప్యానెల్ మీద ఉండే నానో బనానా ఆప్షన్ ఎంచుకోవాలి. 
3. షరతులు అంగీకరించాకే టూల్ ఉపయోగించగలరు. అక్కడ మీ వ్యక్తిగత ఫోటో లేదా మీరు మార్చాలనుకున్న ఫోటోను అప్ లోడ్ చేయండి.
4. 3D ట్రెండింగ్ స్టైల్ కోసం ప్రాంప్ట్ ఇవ్వండి. (ఉదా: "create a 3D mini figurine in Nano Banana style") ఇవ్వండి.
5. AI ఫోటోని ప్రాసెస్ చేసి, 3D మోడల్ లేదా కార్టూన్ స్టైల్ చిత్రాన్ని సృష్టిస్తుంది
6. AI మీ ఫోటోని ప్రాసెస్ చేసి ఒక నమూనా 3D మోడెల్ లేదా ట్రెండింగ్ నానో బనానా ఇమేజ్ సృష్టిస్తుంది.
7. సృష్టించిన 3D ఇమేజిని డౌన్లోడ్ చేసుకొని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. 

అంతే సింపుల్‌గా మీకు నచ్చిన నానో బనానా ఇమేజ్ నచ్చిన వారికి సృష్టించిన వెంటనే.. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలలో షేర్ చేసేయండి. కావాలనుకుంటే ఇందులో ప్రత్యేక ఎఫెక్ట్స్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌లు చేర్చడం కూడా చేయవచ్చు. మీరు సృష్టించే ఇమేజ్‌లు ఎట్లా ఉంటాయో ముందే చూడటానికి డిపిక్షన్‌ను ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే ఒక ఫోటోను విభిన్న మోడళ్లలో కూడా రెడీ చేసుకోవచ్చు.