గేమింగ్ కంపెనీలో లేఆఫ్స్.. 170 మందిని ఇంటికి పంపిన జుపే..

 గేమింగ్ కంపెనీలో లేఆఫ్స్.. 170 మందిని ఇంటికి పంపిన జుపే..

భారత ప్రభుత్వం ఇటీవల రియల్ మనీ గేమింగ్ పై నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను స్టార్ట్ చేశాయి. తాజాగా జుపే గేమింగ్ కంపెనీ 170 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలోని 30 శాతం ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఈ నిర్ణయం చట్టాన్ని అనుసరించేందుకు అవసరమైన వ్యూహాత్మక వ్యాపార పునర్రూపకల్పన భాగంగా తీసుకోబడింది. ఈ నిర్ణయం కఠినమైనదైనా, సంస్థకు కొత్త నియంత్రణ నిబంధనలు పాటించటానికి అవసరమైనదిగా జుపే చెబుతోంది. 

ఉద్యోగులకు సహాయం..
లేఆఫ్ అయిన ఉద్యోగులకు వార్షిక సేవల ఆధారంగా ఆర్థిక సాయం(నోటీసు కాలానికి మించి) ఇవ్వబడుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏడాది పూర్తి కాలానికి వర్తింపజేశారు. అలాగే ఉద్యోగులు కొత్త జాబ్ వెతుక్కునే సమయంలో వారికి భద్రత కల్పించేందుకు రూ. 1 కోట్ల విలువైన మెడికల్ సపోర్ట్ ఫండ్ ఏర్పాటు చేసింది. అలాగే కంపెనీ భవిష్యత్తులో కొత్త జాబ్స్ ఉన్నప్పుడు ఈ ఉద్యోగుల్ని మళ్ళీ నియమించుకోవాలని ప్రాధాన్యత ఇస్తోంది.

ALSO READ : ఉద్యోగులకు శుభవార్త.. 

గేమింగ్ కంపెనీ జుపే ఆన్‌లైన్ సోషల్ గేమ్స్ సహా ఇతర వినోద ఉత్పత్తులపై దృష్టి సారించనుంది. అలాగే దేశంలో తమ 150 మిలియన్లకు పైగా రిజిస్ట్రేష్టర్డ్ కస్టమర్లతో సాంస్కృతిక ప్రాతినిధ్యం ఉన్న గేమ్స్, షార్ట్ వీడియో కంటెంట్ వంటి కొత్త విభాగాల్లోకి విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. 

ఇదే క్రమంలో దేశంలో My11Circle, RummyCircle వంటి ప్లాట్‌ఫామ్‌లను నిర్వహించే గేమ్స్ 24x7 కంపెనీ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అలాగే అతిపెద్ద గేమింగ్ కంపెనీల్లో ఒకటైన మొబైల్ ప్రీమియర్ లీగ్(MPL) తన స్థానిక ఉద్యోగుల్లో 60% అంటే దాదాపు 300 మందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ రంగంలో తొలగింపులు మరింతగా కొనసాగవచ్చని తెలుస్తోంది.