ఉద్యోగులకు శుభవార్త.. రెండో భార్య ప్రయాణ ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది..!

ఉద్యోగులకు శుభవార్త.. రెండో భార్య ప్రయాణ ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది..!

ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుంచి కోరుకుంటున్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. ఇకపై ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద మారిన నిబంధనలతో రెండవ భార్య ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. వాస్తవానికి ఉద్యోగి తన కుటుంబంతో కలిసి దేశంలో ఏ ప్రాంతానికైనా ప్రయాణించినప్పుడు దానికి అయ్యే ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. 

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యేక అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అతను రెండవ భార్యను లీవ్ ట్రావెల్ కన్సెషన్ కింద కుటుంబంలో చేర్చినట్లు పరిగణించబడుతుందని కూడా నిబంధనలలో స్పష్టం చేయబడింది. అంటే ఇకపై మార్పు చేయబడిన నిబంధనల ప్రకారం అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు తన ఇద్దరు భార్యలతో కలిసి ప్రయాణం చేసేందుకు ప్రయోజనాలు అందించబడతాయి. పైగా గతంలో ఉన్న ప్రయాణ పరిమితులను తీసేయటంతో ఉద్యోగి ఫ్యామిలీతో దేశంలో ఏ మూలకైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేయబడింది. 

ALSO READ : కుటుంబ సంపదను కాపాడే పన్ను ఆయుధం HUF..

ఉద్యోగి.. తన భార్యలు, పిల్లలు, పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు, ఒంటరిగా ఉన్న తమ్ములు/చెల్లెల్లు లీవ్ ట్రావెల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం అర్హులుగా నిబంధనలు చెబుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అనుమతితో రెండవ వివాహం చేసుకుంటే.. ఇప్పుడు ఇద్దరు భార్యలను కూడా 'కుటుంబం'లో భాగంగా పరిగణిస్తారు. గతంలో ఈ అంశంపై అస్పష్టత ఉండేది.. కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన నియమాలపై క్లారిటీ ఇవ్వబడింది. పైగా ఎక్కువ మంది కుటుంబం సభ్యులతో ప్రయాణానికి మార్గం సుగమం చేయబడింది. 

ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు సెలవు ప్రిపరేటరీలో, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి స్వస్థలానికి ప్రయాణం, 4 ఏళ్లకు ఒకసారి భారతదేశంలోని ఏ ప్రదేశానికి అయినా ప్రయాణం LTCలో చేర్చబడతాయి. ఒకే ఒక షరతు ఏమిటంటే పదవీ విరమణ సెలవు ముగిసేలోపు తిరుగు ప్రయాణాన్ని ఉద్యోగి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగి తన జీవిత భాగస్వామి పిల్లలను ప్రధాన కార్యాలయం కాకుండా వేరే చోట పోస్ట్ చేసినట్లయితే.. వారి ప్రయాణం ఎక్కడ ప్రారంభించారనే దానితో సంబంధం లేకుండా మొత్తం ప్రయాణ ఖర్చులు వారి అర్హత ప్రకారం తిరిగి చెల్లించబడతాయి.