కుటుంబ సంపదను కాపాడే పన్ను ఆయుధం HUF.. పూర్తి వివరాలు..

కుటుంబ సంపదను కాపాడే పన్ను ఆయుధం HUF.. పూర్తి వివరాలు..

భారత పన్ను చట్టంలో హిందూ అవిభాజిత కుటుంబం(HUF) అనేది ప్రత్యేకమైన పన్ను చట్టబద్ధమైన ఎంటిటీ. దీంతో ఆదాయపన్ను రిటర్నులు వేసుకోవచ్చు, వ్యాపారం నడపవచ్చు, ఆస్తిని స్వంతం చేసుకోవచ్చు, వ్యక్తుల్లాగే పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. కాబట్టి ఒక కుటుంబం దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే లక్షల్లో పన్ను ఆదా చేసుకోవచ్చు. కానీ చిన్న తప్పిదమే ఈ నిర్మాణాన్ని పన్ను భారంగా మార్చేస్తుందని గమనించాలి.

అసలు HUF ఎలా పనిచేస్తుంది?
* HUF ను రూపొందించగలిగేది హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే.
* దీనికోసం కనీసం ఇద్దరి అవసరం ఉంటుంది. ఒకరు కర్త (family head), మరొకరు కోపార్సెనర్(coparcener) అవసరం.
* 2005లో తెచ్చిన చట్ట సవరణ తర్వాత కుమార్తెలు కూడా సమాన హక్కులు పొందారు. వారు కూడా కర్త కావచ్చు.

HUF ఏర్పాటుకు అఫిడవిట్ తయారు చేయాలి. PAN నంబర్ దరఖాస్తు చేయాలి. అలాగే ప్రత్యేకమైన బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. దీనికి తోడు లెక్కల పుస్తకాలు నిర్వహించటం తప్పనిసరి. మీ వ్యక్తిగత జీతం/సేవింగ్స్‌ని HUFలో పెడితే Section 64(2) ప్రకారం ఆ ఆదాయం మీ వ్యక్తిగత పేరుకే క్లబ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ప్రయోజనం సూన్యం. HUF నిజంగా లాభదాయకంగా ఉండాలంటే ఆస్తులు వారసత్వం, లేదా బహుమతుల రూపంలో వస్తే ప్రయోజనం. అయితే దీని ఆస్తుల అమ్మకానికి అందరి అనుమతి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. 

ALSO READ : ఆగస్టులో ట్రెండ్ మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్..

సోలో ప్రొప్రైటర్‌షిప్ లాంటి వ్యాపారం HUF పేరుతో చేయవచ్చు. ఉదాహరణ.. ఒక కుటుంబం రూ.10 లక్షల వారసత్వ నిధితో డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ మొదలుపెట్టింది. ఉద్యోగులుగా కుటుంబ సభ్యులకు జీతాలు ఇచ్చి మిగతా లాభాన్ని HUF పేరుతో ప్రకటించింది. అలా ప్రతి సంవత్సరం రూ.1.8 లక్షల పన్ను ఆదా సాధించారు.

HUF కి ఉండే ప్రత్యేక పన్ను ప్రయోజనాలు..
* వేరుగా బేసిక్ పన్ను మినహాయింపు రూ.2 లక్షల50వేలు.
* పెట్టుబడి లాభాలపై సెక్షన్ 54 & 54F రోలోవర్స్.
* పూర్తి స్థాయిలో సెక్షన్ 80C కింద రూ.లక్ష 50వేలు మినహాయింపు.