ఒప్పో ఇండియా కే14ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ ఇందులోని ప్రత్యేకతలు. ధరలు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ఉంటాయి. అమ్మకాలు ఈ నెల 16 నుంచి మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ధర, లభ్యత..
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది..
4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14వేల999
6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.16వేల999
ఆఫర్: లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ప్రారంభ ధర రూ.13వేల499 కే అందుబాటులోకి ఉంటుంది.
సేల్: ఫిబ్రవరి 16, 2026 నుంచి Flipkart, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ , ప్రముఖ రిటైల్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.
