ములుగు, వెలుగు: ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి నిధులు మంజూరు చేశారు. శుక్రవారం రాత్రి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో ఆయన మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టుగా మంత్రి వివేక్ వెంకట స్వామి ప్రకటించారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం రేపటి నుంచి వస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
