తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( మే 1 ) మే డే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు మంత్రి వివేక్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో, తెలంగాణలో ఉన్న కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పక్షాన నిలుస్తోందని.. ప్రజా పాలన ప్రభుత్వం కార్మిక వర్గానికి అండగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని.. సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఏ వర్గాన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్.
మే డే సందర్బంగా సందేశం
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) April 30, 2026
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో మరియు తెలంగాణలో ఉన్న కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పక్షాన నిలుస్తోంది. ప్రజా పాలన ప్రభుత్వం… pic.twitter.com/eB6AviUHOV
కార్మికుల హక్కులను రక్షించేందుకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికుల సంక్షేమ చట్టం – 2026ను ప్రభుత్వం కొద్ది కాలం క్రితమే అసెంబ్లీ లో మంజూరు చేసిందని... ఈ చట్టం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకుపైగా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు.ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఎక్కువ భాగాన్ని పరిష్కరించి, ఇటీవల 11శాతం వేతనవృద్ధి ప్రకటించడం ద్వారా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల తన నిబద్ధతను చాటిందని అన్నారు.
తెలంగాణలోని ప్రతి కార్మికుడు గౌరవప్రదమైన జీవితం గడపాలని, సురక్షితమైన పనివాతావరణంలో పని చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని... తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధికి కార్మికులే మూలస్తంభమని అన్నారు. కార్మిక హక్కులకు దారితీసిన బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలతో పాటు, దేశవ్యాప్తంగా కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, సింగరేని కార్మికుల హక్కుల కోసం పోరాడిన కాకా వెంకటస్వామి ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు మంత్రి వివేక్.
