ఐకమత్యంతో గణేష్ పండుగ జరుపుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఐకమత్యంతో గణేష్ పండుగ జరుపుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • బోడుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణేశుడిని దర్శించుకున్న మినిస్టర్​

మేడిపల్లి వెలుగు: గజానన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోడుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉన్న గణేశుడిని శుక్రవారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన మాట్లాడుతూ ‘వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవాలి’ అని అన్నారు. గజానన యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు.