రేపు జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు..ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు వీళ్లే..

రేపు  జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు..ఆలయాలకు  పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు వీళ్లే..

హైదరాబాద్ లో బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు గోల్కోండ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు పూర్తయ్యాయి. ఇక రేపు (జులై 20)న నగరంలోని జంటనగరాల్లో పలు చోట్ల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా మంత్రులు ,ముఖ్య నేతలు పలు  ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏ మంత్రి ఏ దేవాలయం దగ్గర పట్టు వస్త్రాలు సమర్పించనున్నారో చూద్దాం..

రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న నేతలు 


1. శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయం , లాల్ దర్వాజ హైదరాబాద్ -  ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 
2. శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం ,నాచారం ఉప్పల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా -  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
3. శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం కార్వాన్ - మంత్రి దామోదర రాజనర్సింహ 
4. శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
5. శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, హరి బౌలి - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
6. శ్రీ కట్టమైసమ్మ ఆలయం, చిలకలగూడ సికింద్రాబాద్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 
7. శ్రీ నల్లపోచమ్మ ఆలయం సబ్జిమండి - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
8. ఖిలా మైసమ్మ ఆలయం ఎన్టీఆర్ నగర్ ఎస్.ఆర్ఆర్ నగర్ - మంత్రి సీతక్క 
9. శ్రీ మహంకాళి ఆలయం మీరాలంమండి - మంత్రి జూపల్లి కృష్ణారావు
10. శ్రీ ముత్యాలమ్మ ఆలయం, బేల - మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి
11. శ్రీ మహంకాళి ఆలయం గౌలీపుర (శ్రీ భారతమాత కోట మైసమ్మ ఆలయం) -మంత్రి వాకిటి శ్రీహరి 
12. శ్రీ జగదాంబ ఆలయం, సుల్తాన్ షాహి - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 
13. శ్రీ మహంకాళి ఆలయం, ఉప్పుగూడ - గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్
14. శ్రీ బంగారు మైసమ్మ ఆలయం, బోయిగూడ - రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ 
15. శ్రీ బంగారు మైసమ్మ ఆలయం,హరి బౌలి - గద్వాల విజయ లక్ష్మీ, జీహెచ్ఎంసీ మేయర్
16. శ్రీ మహంకాళి ఆలయం, అంబర్ పేట - బండా ప్రకాష్ ,శాసన మండలి డిప్యూటీ చైర్మన్ 
17. శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం,అలియాబాద్ - జాటోథ్ రామచందర్ నాయక్ డిప్యూటీ స్పీకర్