రూ.2.98 కోట్లతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి

రూ.2.98 కోట్లతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి

రంగారెడ్డి జిల్లా: జంట నగరాలకు ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మహేశ్వరం మండలంలోని నాగారం,పల్లెగడ్డ, సిరిగిరిపురం, తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీనగర్, తుమ్మలూర్ లలో  అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు ఏర్పాటయ్యాయి. రూ.2.98 కోట్లతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ధి చేసినట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ప‌ల్లెగ‌డ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్, సిరిగిరి పురం పార్క్, తుమ్మలూర్ అర్బన్ ఫారెస్ట్, మన్యం కంచె అర్బన్  ఫారెస్ట్ పార్కులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. పార్కుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

 

*ప్రకృతిని రక్షిద్దాం....భావితరాలకు భవిష్యత్తు ఇద్దాం.* *ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం...

Posted by Sabitha Indra Reddy on Thursday, July 28, 2022

మ‌హేశ్వరం మండలం హ‌ర్షగూడ గ్రామంలో 87.41హెక్టార్ల విస్తీర్ణంలో ప‌ల్లెగ‌డ్డ  అర్బన్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి,  జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, హెచ్ఏండీఏ డైరెక్టర్ ప్రభాకర్, హెచ్ఏండీఏ ఎస్ఈ హుస్సేన్, హెచ్ఏండీఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాములు,  ఎఫ్డీవో విజయానంద రావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.