హైదరాబాద్ సిటీలో ఘోరం : ప్రేమ వ్యవహారంలో 16 ఏళ్ల బాలుడిని కొట్టి చంపేశారు

హైదరాబాద్ సిటీలో ఘోరం : ప్రేమ వ్యవహారంలో 16 ఏళ్ల బాలుడిని కొట్టి చంపేశారు
  • హత్యకు దారి తీసిన లవ్..
  • నా లవర్ కి ఎందుకు కాల్ చేస్తున్నావ్.. మాజీ ప్రియుడి వార్నింగ్..
  • కలిసి మాట్లాడదాం అని పిలిచి గ్యాంగ్ తో దాడి..
  • హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన 16 ఏండ్ల యువకుడు..
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కుషాయిగూడ పోలీసులు..
హైదరాబాద్​ కుషాయిగూడ.. రాధికా థియేటర్​ సెంటర్​ దారుణం జరిగింది.  తన ప్రియురాలితో మాట్లాడుతున్నాడని 16 సంవత్సరాల బాలుడిని.. మాజీ ప్రియుడు.. అతని గ్యాంగ్​ కొట్టి చంపింది. బాధితుడు కాప్రాలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందాడు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 కుషాయిగూడ పరిధిలోని రాధిక సెంటర్ కు​ దగ్గరలో హత్య జరిగింది. 16 సంవత్సరాల  అయాన్  అనే యువకుడిపై కొంతమంది దాడి చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసింది. 

కుషాయిగూడ జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో 16 సంవత్సరాల అయన్ తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. గురువారం  ( జూన్​ 5) సాయంత్రం ఓ యువకుడు అయాన్ కి కాల్ చేసి నా ప్రియురాలితో ఎందుకు మాట్లాడుతున్నావని ... ఫోన్లో బూతులు తిట్టి..  రాథికా థియేటర్ సమీపానికి రావాలని, అక్కడ మాట్లాడుకుందామని యువతి మాజీ ప్రియుడు  అయాన్​ ను పిలిచాడు.  

దీంతో అయాన్​ రాధికా సెంటర్​  కు వచ్చాడు.  అక్కడకు  ఆ యువతి మాజీ ప్రియుడితో  ... మరి కొంతమంది  బైకులపై వచ్చిచితక్కొట్టారు.  ఈ ఘటనలో అయాన్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీనిని గమనించిన స్థానికులు 108 కు ఫోన్​ చేసి కాప్రాలోని  ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.  అయాన్​ కు డాక్టర్లు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.  సదరు సమాచారాన్ని ఆస్పత్రి వారు కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు.  హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి .. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు.  మృతునిపై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. .