తాళం వేసి.. ఫోన్లు గుంజుకుని.. మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

తాళం వేసి.. ఫోన్లు గుంజుకుని.. మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు
  • సడన్​ ఎంట్రీతో బెంబేలెత్తిన ఉద్యోగులు

 

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్​పీ జగదీశ్​చంద్ర ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలతో కూడిన టీం ఉదయం ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లింది. సిబ్బంది వద్ద ఉన్న సెల్‌‌ఫోన్లు, ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఆఫీసు డోరుకు తాళం వేసి రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక రాకతో మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆఫీసులో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి.