ఫన్ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిస్ అండ్ మిస్టర్ శెట్టి

ఫన్ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిస్ అండ్ మిస్టర్ శెట్టి

అనుష్క, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి.మహేష్‌‌‌‌‌‌‌‌ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌, సాంగ్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓ ప్రైవేట్ ఇంజినీ రింగ్ కాలేజ్‌‌‌‌‌‌‌‌లో  రిలీజ్ చేసింది. ఒక చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ మధ్య సాగే డ్రామాను ఫన్ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపిస్తూ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాపై అంచనాలు పెంచారు. అన్విత రవళి పాత్రలో నటించిన అనుష్క ప్రొఫెషనల్ చెఫ్.

పెళ్లంటే ఇష్టం ఉండదు. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. మరోవైపు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఇష్టం లేకపోయినాA స్టాండప్ కమెడియన్‌‌‌‌‌‌‌‌గా సక్సెస్ అవ్వాలనుకునే క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నవీన్ కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరికీ అనుకోకుండా పరిచయమై ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌గా మారుతారు.  మరి ఆ స్నేహం ఎక్కడ వరకు వెళ్లిందనేది  తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఉందీ టీజర్.  తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.