హైదరాబాద్: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో విజేతలు, టైటిల్ హోల్డర్లతో బంజారాహిల్స్ లోని ఎంప్రా బై ప్రతివాది డిజైనర్ స్టోర్ లో శనివారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. మిస్ యూనివర్స్ తెలంగాణ–2026 విజేత హసిత నారాయణభట్ట, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్–2026 విజేత ఫసీహా నౌమాన్ లు నేషనల్ లెవల్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ డిజైనర్ మాధురి ప్రతివాది రూపొందించిన డిజైనర్ డ్రెస్సుల్లో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో టాలెంటెడ్ యంగ్ స్టార్స్ ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే పోటీలకు తెలుగు అమ్మాయిలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. మిస్ యూనివర్స్ ఇండియా–2025 మానికా విశ్వకర్మ, మిస్ యూనివర్స్ ఇండియా ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అమ్జద్ ఖాన్, మిస్ యూనివర్స్ తెలంగాణ–2025 కాశ్వి హాజరై పోటీదారులను అభినందించారు. తెలంగాణ ఫస్ట్ రన్నరప్ సృష్టి కనిందే, ఏపీ ఫస్ట్ రన్నరప్ హిమ వర్మ,సెకండ్ రన్నరప్ సోనాలి యాదవ్ పాల్గొన్నారు.
