మెన్స్‌‌ లైట్‌‌ వెయిట్‌‌ విభాగంలో తృటిలో పతకం మిస్‌‌..

మెన్స్‌‌ లైట్‌‌ వెయిట్‌‌ విభాగంలో తృటిలో పతకం మిస్‌‌..

మెన్స్‌‌ లైట్‌‌ వెయిట్‌‌ విభాగంలో అశోక్‌‌ మాలిక్‌‌ 143.8 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌లో నిలిచి తృటిలో పతకం కోల్పోయాడు. పరంజీత్‌‌ కుమార్‌‌ (135.6) ఏడో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్‌‌ హెవీ వెయిట్‌‌ ఫైనల్లో కస్తూరి రాజమణి మూడు ప్రయత్నాల్లో విఫలమైంది.

 లైట్‌‌ వెయిట్‌‌ ఫైనల్లో జస్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌, సుమన్‌‌ దేవి పతకాలు సాధించలేకపోయారు. ఆర్టిస్టిక్‌‌ జిమ్నాస్టిక్‌‌లో తపన్‌‌ మొహంతి, యోగేశ్వర్‌‌ సింగ్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌‌లో తపన్‌‌ (71.700 పాయింట్లు), యోగేశ్వర్‌‌ (71.400 పాయింట్లు) వరుసగా 17, 18వ స్థానాల్లో నిలిచారు. 

అపారటస్‌‌ రింగ్స్‌‌లో స్వాతిష్‌‌ కైతేరి పుతలాత్‌‌ (12.450 పాయింట్లు),  వాల్ట్‌‌ కేటగిరీలో యోగేశ్వర్‌‌ సింగ్ (12.600) రెండో రిజర్వ్‌‌ ప్లేయర్లుగా నిలిచారు. మెన్స్‌‌ టీమ్‌‌ విభాగంలో ఇండియా 208.550 పాయింట్లు సాధించి  ఏడో స్థానంతో ముగించింది.