కుక్క మిస్సింగ్: పోలీసులకు ఫిర్యాదు

కుక్క మిస్సింగ్: పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: పెంపుడు కుక్క తప్పి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ లో జరిగింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోకో (కుక్క పిల్ల) కనిపించడంలేదని కుషాయిగూడు పోలీసులకు కంప్లైంట్​ చేశాడు. కుక్క పిల్ల ఫొటో పోలీసులకు ఇచ్చి వెతికిపెట్టమని తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు మిస్సింగ్​ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.