పెన్షన్ కోసం మల్లాపూర్మండల బీడీ కార్మికుల ధర్నా

పెన్షన్ కోసం మల్లాపూర్మండల బీడీ కార్మికుల ధర్నా

మల్లాపూర్, వెలుగు:- ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. అర్హులైన బీడీ కార్మికులకు అమలు చేయడంలేదని జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండల బీడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద బైఠాయించి మంగళవారం నిరసన తెలిపారు. 

అర్హులైన బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న ఎస్సై అనిల్, ఎంపీడీవో శ్రీకాంత్ వారి వద్దకు వెళ్లి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.