- డైరెక్టర్ జైసింగ్ రాథోడ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఇటీవల చేసిన అరుదైన సర్జరీలు విజయవంతమయ్యాయని ఆస్పత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓ 12 ఏండ్ల బాలికకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సర్జరీ, 20 ఏండ్లుగా రెండు కిలోల థైరాయిడ్ గడ్డతో బాధపడుతున్న మరో మహిళకు సర్జరీ చేశామన్నారు.
ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలకు ప్రైవేట్‌లో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ రిమ్స్‌లో ఉచితంగా చేసినట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నరేందర్ బండారి, ఆర్ఎం చంపత్ రావు, వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు.
