తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం.. మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టు వెల్లడి

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం..  మిషన్ చాణక్య పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టు వెల్లడి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మిషన్ చాణక్య సంస్థ నిర్వహించిన పబ్లిక్ పోల్స్ సర్వే రిపోర్టును విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికారం మళ్లీ BRSదే అని సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది ఈ సంస్థ. గత నాలుగు నెలలుగా విస్తృతంగా అధ్యయనం చేసి.. డేటా సేకరించింది. 

పబ్లిక్ ఒపీనియన్​లో బీఆర్ఎస్ కు 41. 62శాతం మంది అనుకూలంగా (మద్దతుగా) ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్​లో కాంగ్రెస్​కు 32. 7శాతం, బీజేపీకి 17.6శాతం మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారు. నా రాష్ట్రం.. నా ఓటు.. నా నిర్ణయం.. అనే పేరుతో మిషన్ చాణక్య సంస్థ సర్వే చేపట్టింది. 

ప్రభుత్వ  పథకాలు, అభివృద్ధిపై 85 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మహిళా ఓటర్ల నుంచి ఆ పార్టీకి భారీగా సానుకూల స్పందన వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. 

అన్ని వయసుల ఓటర్లలోనూ అధిక శాతం మంది బీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 44.62 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. అదే కాంగ్రెస్‌ 32.71 శాతానికే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీకి 17.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తెలిసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌ పార్టీ కనీసం 76 స్థానాల్లో గెలుస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది.