మియాపూర్‌‌లో ఏడేండ్ల బాలికపై లైంగికదాడి..కిరాణ షాప్ యజమానికి 20 ఏండ్ల జైలు

మియాపూర్‌‌లో ఏడేండ్ల బాలికపై లైంగికదాడి..కిరాణ షాప్ యజమానికి 20 ఏండ్ల జైలు

గచ్చిబౌలి, వెలుగు: మియాపూర్‌‌లో ఏడేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ కిరాణ షాప్​యజమానికి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చిందని సైబరాబాద్​క్రైం డీసీపీ ముత్యంరెడ్డి తెలిపారు. జహీరాబాద్‌‌కు చెందిన మహమ్మద్ నజీర్ మియా(57) మియాపూర్​మార్తాండానగర్‌‌లో కిరాణ దుకాణం నడిపేవాడు. 2023 మార్చి 27న పాల ప్యాకెట్ కోసం షాపునకు వచ్చిన బాలికను లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కస్టమర్ రావడంతో బాలికను వదిలేయగా,

ఆమె ఇంటికి వెళ్లి తల్లికి జరిగిన విషయాన్ని తెలిపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అదే నెల 31న నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జ్ షీట్ వేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమవారం మహమ్మద్ నజీర్ మియాకు శిక్ష ఖరారు చేశారు.