కొత్తవాళ్లకే ప్రయారిటీ.. సీనియర్లను పట్టించుకోవట్లే ..పీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేతల ఫిర్యాదు 

కొత్తవాళ్లకే ప్రయారిటీ.. సీనియర్లను పట్టించుకోవట్లే ..పీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేతల ఫిర్యాదు 
  • ఉమ్మడి నల్గొండకు నామినేటెడ్​ పోస్టుల్లో ప్రయారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి 
  • మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి గైర్హాజరు

యాదాద్రి, వెలుగు: కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అయితే పార్టీలో కొందరు లీడర్లు వారిని పట్టించుకోవడం లేదని పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ.. ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చాలామంది కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిపారు.

సోమవారం భువనగిరిలో జరిగిన యాదాద్రి, సూర్యపేట, నల్గొండ జిల్లాల పొలిటికల్ ఎఫైర్స్​కమిటీ (పీఏసీ) సమావేశంలో మీనాక్షి నటరాజన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ ముఖ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు. కొత్తగా పార్టీలోకి వచ్చి తమ వెంట తిరుగుతున్న వారికే కొందరు ఎమ్మెల్యేలు ప్రయారిటీ ఇస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన 11 స్థానాలు కీలక పాత్ర పోషించాయని, అందువల్ల నామినేటెడ్ పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందని పలువురు మహిళా లీడర్లు వాపోయారు. నామినేటెడ్​ పోస్టుల్లో మహిళలకు 33 శాతం కేటాయించాలని యాదాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, నల్గొండ అధ్యక్షురాలు మాధవి కోరారు. సొంత పార్టీ కౌన్సిలర్లే తనకు సహకరించడం లేదని మోత్కూరు మున్సిపల్ చైర్​పర్సన్ గడ్డం స్వప్న ఫిర్యాదు చేశారు. పీఏసీ మీటింగ్​కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజర్ అయ్యారు. 

సర్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా ఓట్లు తొలగించారు: మీనాక్షి నటరాజన్

బీజేపీ తెలంగాణపై ఫోకస్​చేస్తున్నదని.. మనమంతా విబేధాలు వీడి సర్​లో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని పీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి సూచించారు. తొలగించిన ఓట్లలో అర్హులను గుర్తించి తిరిగి చేర్పించడంతోపాటు కొత్త ఓటర్లనూ చేర్పించాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతూ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరాడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి ఉత్తమ్, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్​, మందుల సామెల్, జైవీర్ రెడ్డి, వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు.