- కొంతకాలంగాసహజీవనంలో ఉన్న జంట
- వేరే వాళ్లతో చనువుగా ఉంటుందనే అనుమానంతో మర్డర్
- బాలాపూర్‌లో విషాదం!
బాలాపూర్, వెలుగు: వాళ్లిద్దరి వయస్సు 21.. ఇద్దరు చేసేది లేబర్ పనే.. అక్కడే ఒక్కటయ్యారు.. కలిసి సహజీవనం చేస్తున్నారు.. కానీ, సదరు యువతి కొద్దికాలంగా తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. అయితే, ఆమె తోటి లేబర్లతో మాట్లాడుతోందని, చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న అతడు పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. చివరకు ఆమెను దారుణంగా చంపి గోనెసంచిలో మూటకట్టి పడెయ్యడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలాపూర్ బిస్మిల్లా కాలనీకి చెందిన అహ్మద్ సలాం (21) స్థానిక ఫంక్షన్ హాల్లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఆదే ఫంక్షన్ హాల్లో బిహార్‌కు చెందిన రెహానా(21) కూడా లేబర్‌గా పనిచేసేది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ బిస్మిల్లా కాలనీలోని సలాం ఇంట్లోనే కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
అందరూ మాటలంటున్నారు
‘సహజీవనం చేసింది చాలు. నన్ను అందరూ ఏవో మాటలంటున్నారు. సమాజంలో నాకు నీ భార్యగా గుర్తింపు కావాలి’ అని రెహానా తనను పెండ్లి చేసుకోవాలని సలాంపై ఒత్తిడి తెస్తోంది. ఆదివారం ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సలాం విచక్షణ కోల్పోయి రెహానాను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేసేందుకు గోనెసంచిలో మూటకట్టాడు. ఇదంతా గమనించిన పక్కింటి వాళ్లు తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఇంట్లో తనిఖీ చేశారు. గోనెసంచిలో మూటకట్టిన డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడిని
అదుపులోకి తీసుకున్నారు.
