- కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త సర్వే నం.83/1లోని రెండు ప్లాట్‌ల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతోపాటు టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ తదితరులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కివాయిదా వేసింది.
రాయదుర్గం పన్మక్త సర్వేనెం.83/1లోని పీ1, పీ2 ప్లాట్‌ల వేలం కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ డాక్టర్ ఎస్.రవీంద్రనాథ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
