ఆ పేజీలో ఏముందిరా..ఒక్కరోజే 1.6 లక్షల మంది ఫాలోవర్లు..అంతలోనే మాయమైన ‘దిమాకీ నక్సల్ పార్టీ’ ఇన్‌‌స్టా పేజ్

ఆ పేజీలో ఏముందిరా..ఒక్కరోజే 1.6 లక్షల మంది ఫాలోవర్లు..అంతలోనే మాయమైన ‘దిమాకీ నక్సల్ పార్టీ’ ఇన్‌‌స్టా పేజ్

న్యూఢిల్లీ: ఇన్‌‌స్టాలో రాత్రికి రాత్రే సంచలనం సృష్టించిన ‘దిమాగి నక్సల్ పార్టీ’ అనే ఇన్‌‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక్క రోజులోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని, అంతే వేగంగా అదృశ్యమైంది. ఈ అకౌంట్‌‌లో మొత్తం 62 పోస్టులు ఉండగా, సుమారు 35 మందిని ఫాలో అయ్యారు. ఇన్‌‌స్టాగ్రామ్ సమాచారం ప్రకారం.. ఈ ఖాతాను ఈ నెలలోనే ప్రారంభించారు. దీని యూజర్ నేమ్‌‌ను ఒక్కసారి మార్చినట్లు అకౌంట్ లాగ్ ద్వారా తెలిసింది. 

అయితే, ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారనే వివరాలు మాత్రం అందులో ఎక్కడా వెల్లడించలేదు. భారత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ మావోయిస్టులపై పోరులో సాధించిన విజయాలు, నీడలో పొంచివున్న ముప్పు గురించి ప్రస్తావిస్తూ ‘దిమాకీ నక్సల్’ అనే పదాలను ఉపయోగించారు.