డెహ్రాడూన్: విద్యారంగం, ఉద్యోగ నియామక పరీక్షల్లో అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని.. ఈ సమస్యలను పరిష్కరించకపోతే తాను మళ్లీ నిరసన చేపడతానని యోగా గురువు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్కూళ్లల్లో కనీస సౌలతులు లేక స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నా రని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలు పెరిగాయని.. కుల, మతాల ఆధారంగా ఎంపికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరారు. లేదంటే 2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిరసన చేసిన తరహాలోనే.. మళ్లీ తాను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని హెచ్చరించారు.
