సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన.. పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

సోమారంలో వైభవంగా శివాలయ పునఃప్రతిష్ఠాపన..  పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారంలో శివాలయ పునఃప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. 

అదేవిధంగా నాగుల పంచమి సందర్భంగా తొర్రూరు పట్టణంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే వేడుకల్లో పాల్గొని నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, శివాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఫొటోలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, మరో వర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చకు
 దారితీసింది.