హైదరాబాద్ బ్లాక్ హాక్స్ పేరు మార్పు..

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ పేరు మార్పు..

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైమ్‌‌ వాలీబాల్‌‌ లీగ్‌‌ (పీవీఎల్‌‌) వ్యవస్థాపక ఫ్రాంచైజీల్లో ఒకటైన హైదరాబాద్‌‌ బ్లాక్‌‌హాక్స్‌‌.. ఇకపై ‘తెలుగు బ్లాక్‌‌హ్యాక్స్‌‌’గా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలను వాలీబాల్‌‌కు మరింత చేరువగా చేయడంతో పాటు తెలుగు ప్రవాస సమాజంతో బలమైన అనుబంధాన్ని ఏర్పర్చుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. 

అదే టైమ్‌‌లో పీవీఎల్‌‌ సీజన్‌‌–5 కోసం బలమైన జట్టును రూపొందించింది. సోమవారం గోవాలో జరిగిన వేలంలో తెలుగు బ్లాక్ హాక్స్ తనిష్ చౌదరిని రూ.14 లక్షలకు, వినీత్ కుమార్ ను రూ. 8 లక్షలకు, మౌహ్సిన్‌‌ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. హరి ప్రసాద్, దీపక్ ను చెరో రూ. 3 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అదనంగా రైట్ టు మ్యాచ్‌‌ ద్వారా నియాస్ అబ్దుల్ సలామ్ ను రూ. 4 లక్షలకు జట్టులో కొనసాగించింది.