ఆసియా జూనియర్ చాంపియన్లుగా విఘ్నేశ్‌‌‌‌, శరణ్యదేవి

ఆసియా జూనియర్ చాంపియన్లుగా విఘ్నేశ్‌‌‌‌, శరణ్యదేవి

ముంబై: ఇండియా యంగ్‌‌‌‌ చెస్‌‌‌‌ ప్లేయర్లు విఘ్నేశ్‌‌‌‌ వెర్ముల, శరణ్యదేవి.. ఆసియా జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. ఓపెన్‌‌‌‌ కేటగిరీలో 23వ సీడ్‌‌‌‌గా బరిలోకి దిగిన విఘ్నేశ్‌‌‌‌ అద్భుతంగా ఆడాడు. వీరేశ్‌‌‌‌, నందిశ్‌‌‌‌తో సమంగా పాయింట్లు సాధించినా.. మెరుగైన టైబ్రేక్‌‌‌‌ స్కోరు ఆధారంగా విఘ్నేశ్‌‌‌‌ విజేతగా నిలిచాడు.

 అక్షయ్‌‌‌‌ బోర్గోంకర్‌‌‌‌, మాధవేంద్ర ప్రతాప్‌‌‌‌ శర్మ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో 9వ సీడ్‌‌‌‌గా బరిలోకి దిగిన శరణ్యదేవి టోర్నీ మొత్తం వ్యూహాత్మకంగా ఆడింది. దాంతో అత్యధిక పాయింట్లతో టైటిల్‌‌‌‌ను సాధించింది.