- ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చేపట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాములో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడానికి వినూత్న ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండీలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది.
అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో సెల్ఫీ స్టాండీలను అందరికీ కనిపించేలా ప్రముఖంగా ఉంచాలని డీఈఓలు, ఎంఈఓలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశించింది. కేవలం స్కూళ్లలోనే కాకుండా మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి ఎఫ్ఎల్ఎన్ బ్రాండింగ్‌ను పెంచాలని సూచించింది.
