హైదరాబాద్, వెలుగు: ఏఐ రిలయబిలిటీ ఇంజనీరింగ్ సంస్థ క్వాలిటీ కియోస్క్ (క్యూకే) టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఈవో మనీష్ జావర్ మాట్లాడుతూ తాము ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలు అందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఇక్కడ 40 మంది పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగం కస్టమర్లకు ఇక్కడి నుంచి సేవలు అందిస్తామని తెలిపారు.
