టెనెట్ మెడ్ కార్ప్లో టాటా పెట్టుబడి

టెనెట్ మెడ్ కార్ప్లో టాటా పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు :  పాథాలజీ సేవలు అందించే హైదరాబాద్​ స్టార్టప్  టెనెట్ మెడ్‌‌‌‌కార్ప్​లో  టాటా క్యాపిటల్  దాదాపు రూ. 288 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కంపెనీకి  చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ‘టాటా క్యాపిటల్ హెల్త్‌‌‌‌కేర్ ఫండ్ 3 , స్విట్జర్లాండ్‌‌‌‌కు చెందిన గ్లోబల్ ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ‘బ్లూ ఎర్త్ క్యాపిటల్’తో కలిసి ఈ పెట్టుబడి పెట్టింది.  

2018లో శ్రీచరణ్ దేవినేని స్థాపించిన టెనెట్ డయాగ్నోస్టిక్స్, ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 35కి పైగా కేంద్రాలలో 3 వేలకు పైగా సూపర్ స్పెషాలిటీ పరీక్షలను అందిస్తోంది. తాజాగా సేకరించిన నిధులను దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణకు, బీ2బీ నెట్‌‌‌‌వర్క్  పెంచడానికి వాడతారు.