ఎల్ అండ్ టీకి రూ.15 వేల కోట్ల ఆర్డర్‌‌‌‌‌‌‌‌

 ఎల్ అండ్ టీకి రూ.15 వేల కోట్ల ఆర్డర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఇంజనీరింగ్, కన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ  లార్సన్ అండ్‌‌‌‌  టుబ్రో (ఎల్ అండ్ టీ) మిడిల్ ఈస్ట్‌‌‌‌లో  రూ. 15 వేల కోట్లకు పైగా విలువైన భారీ 'అల్ట్రా మెగా' ఆర్డర్‌‌‌‌ పొందింది. కంపెనీకి చెందిన 'ఎల్ అండ్‌‌‌‌ టీ ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆఫ్ షోర్' (ఎల్‌‌‌‌టీఈహెచ్‌‌‌‌) విభాగం ఈ భారీ ప్రాజెక్టును గెలుచుకుంది.  

మిడిల్ ఈస్ట్‌‌‌‌లోని పలు ఆఫ్‌‌‌‌షోర్ ఫెసిలిటీలకు సంబంధించి ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌‌‌‌మెంట్, కన్‌‌స్ట్రక్షన్, ఇన్‌‌‌‌స్టాలేషన్,  కమిషనింగ్ పనులను చేపడుతుంది.