బీఆర్‌ఎస్ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కీసర రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారుకు అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనదారుడు సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న ఎమ్మెల్యే వాహనం ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఉదయం కీసరలో ఓ కార్యక్రమానికి హాజరైన సుభాష్ రెడ్డి.. ఉప్పల్ తిరిగి వస్తుండగా కుషాయిగూడ సమీపంలో కీసర రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసి కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డానని..కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు.
