
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఎమ్మెల్యే అనుచరులుగా ప్రచారం
- తనకు, పార్టీకి సంబంధం లేదన్న ధర్మారెడ్డి
గీసుగొండ (వరంగల్), వెలుగు: తమ సాగు భూములను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు కబ్జా చేయడానికి వచ్చారని ఆరోపిస్తూ కొందరు మహిళా రైతులు వారిని చెప్పులతో కొట్టారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల, మచ్చాపూర్ గ్రామాల మధ్యలోని హజ్య తండాలో ఉన్న భూముల్లోకి సోమవారం కొందరు యువకులు వచ్చారు. అయితే, వారంతా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులంటూ బాధితులు వారిని చెప్పులతో కొడుతూ ఫోన్లలో వీడియో తీశారు. వారిని పొలాల్లోంచి రోడ్డు మీదికి తరిమికొట్టారు. తర్వాత వీడియోను సోషల్‌మీడియోలో పోస్ట్‌చేయడంతో వైరల్ అయ్యింది.
ALSOREAD:హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబ్రాది
చిల్లర రాజకీయాలు : ఎమ్మెల్యే చల్లా
చల్లా అనుచరులుగా భావిస్తున్న సవాయి శ్రీనివాస్, ఇతరులపై రైతులు దాడులకు దిగిన వీడియోలు వైరల్ కావడంతో ఎమ్మెల్యేతో పాటు గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన
బీఆర్‍ఎస్ లీడర్లు స్పందించారు. కొమ్మాల ఘటనలో పాల్గొన్నవారితో తనకు గాని, తమ పార్టీకి గాని సంబంధం లేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తనను డైరెక్ట్‌గా ఎదుర్కొనలేకే ప్రతిపక్షాలకు చెందిన కొందరు లీడర్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.