
- బీసీ సంఘం జాతీయ అధికార ప్రతినిధి దాసు సురేష్ డిమాండ్
- మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘం జాతీయ అధికార ప్రతినిధి దాసు సురేశ్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చల్లా ధర్మారెడ్డిపై అభిశంసన వేటు వేయాలి.. ఎమ్మెల్యే పదవికి శాశ్వత అనర్హుడిగా ప్రకటించాలని దాసు సురేష్ డిమాండ్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కానీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో ఎమ్మెల్యే అయిన నువ్వు.. చివరకు వాళ్లనే అవమానిస్తావా..? నీ అవినీతి బాగోతం అందరికీ తెలుసు.. నీ నియోజక వర్గంలో ఎంత మంది, ఏ ఏ కులాల జనాభా ఉన్నారో అసలు నీకు తెలుసా..? పది శాతం కూడా లేని అగ్రవర్ణాల మెప్పు కోసం 90 శాతం ఉన్న బలహీన వర్గాల వారిని అవమానిస్తావా..? నిన్ను ఎమ్మెల్యే పదవికి శాశ్వత అనర్హుడిగా ప్రకటించాలని దాసు సురేష్ డిమాండ్ చేశారు. త్వరలోనే గవర్నర్, ఎన్నికల సంఘం అధికారులను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వారిని ఎవరు అవమానించినా సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరానికి భారీగా ఖర్చు ..15వ ఆర్థిక సంఘం చివాట్లు
డ్రంకన్ డ్రైవ్ చేస్తే మర్డర్ కేసులు పెట్టాలె