- నాకు ఎన్నికలు కొత్తకాదు.. గెలవడం నా రక్తంలోనే ఉంది:దానం
బషీర్‌బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఈ ప్రస్తావన ఇంకా తమ మధ్య రాలేదని ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందన్నారు. తనకు ఎన్నికలు కొత్త కాదని.. ఇప్పటికీ 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకుందన్నారు.
హిమాయత్ నగర్ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి రూ.1.40 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ, రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, తనవైపు వాదనలు వినిపిస్తానని చెప్పారు.
