అభివృద్ధి పనులే కాంగ్రెస్ ను గెలిపిస్తయ్ : ఎమ్మెల్యే వినోద్

అభివృద్ధి పనులే కాంగ్రెస్ ను గెలిపిస్తయ్ : ఎమ్మెల్యే వినోద్
  •     లిస్ట్​ను ప్రకటించిన ఎమ్మెల్యే వినోద్ 

బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో పోటీచేసే కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితాను డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్​ రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంగళవారం ప్రకటించారు. పీసీసీ, డీసీసీ, ఇంటలిజెన్స్​ నివేదికల ఆధారంగానే కౌన్సిలర్​అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.  

మున్సిపల్ ​ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. టికెట్లు రానివారు అసంతృప్తికి గురికావద్దని, వారికి భవిష్యత్​లో పార్టీ పరంగా నామినేటెడ్​పదవులు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య పాల్గొన్నారు.